జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసం

Oct 22 2025 9:14 AM | Updated on Oct 22 2025 9:14 AM

జ్యోత

జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసం

జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసం

ఖిలా వరంగల్‌ : వరంగల్‌ ఉర్సు కరీమాబాద్‌ దర్గా ప్రాంతం ఆటోస్టాండ్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసమైంది. మద్యం మత్తులో సంచరిస్తున్న ఓ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం పూలే విగ్రహం ధ్వంసమైన విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్‌ మరుపల్లి రవి, స్థానికులు మిల్స్‌ కాలనీ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సిబ్బందితో కలిసి వారు ఘటనాస్థలికి చేరుకుని ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. మొదట గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి, తర్వాత సమీపంలోని రోడ్డుపై ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మద్యం మత్తులో ఉన్న యువకుడు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసి వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఉర్సు కరీమాబాద్‌ వెంకటేశ్వర స్కూల్‌ లేన్‌కు చెందిన రాహుల్‌ను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, మద్యం మత్తులోనే విగ్రహాన్ని ధ్వంసం చేశాడని పోలీసుల విచారణలో తేలింది. విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ తెలిపారు.

నల్ల కండువాలతో నిరసన

ధ్వంసమైన జ్యోతిబా పూలే విగ్రహాన్ని పలు సంఘాలు, బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు పరిశీలించి ఘటనను తీవ్రంగా ఖండించారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పూలే విగ్రహ కమిటీ ప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్‌ నల్లకండువాలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌, అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, డాక్టర్‌ వన్నాల వెంకటరమణ, బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్‌ వడ్లకొండ వేణుగోపాల్‌ గౌడ్‌, పూలే, అంబేడ్కర్‌ వాదులు ధ్వంసమైన విగ్రహాన్ని సందర్శించారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్‌ చైర్మన్‌ బోనగాని యాదగిరి గౌడ్‌, వర్కింగ్‌ చైర్మన్‌ దొడ్డపల్లి రఘుపతి, సభ్యులు కురుమిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌, చాగంటి రమేశ్‌, సమ్మయ్య, పూజారి విజయ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

పూలే, సావిత్రిబాయి విగ్రహాల ఏర్పాటుకు కృషి

ధ్వంసమైన చోటే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని వరంగల్‌ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పేర్కొన్నారు. మంగళవారం ఘటనా స్థలిని సందర్శించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

మద్యం మత్తులో యువకుడి ఘాతుకం

ఘటనాస్థలిని సందర్శించిన

పలు సంఘాల ప్రతినిధులు

జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసం1
1/2

జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసం

జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసం2
2/2

జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement