
రెండేళ్ల పాపపై కుక్క దాడి
గార్ల: రెండేళ్ల పాపపై కుక్క దాడి చేసి తల, ముఖంపై తీవ్రంగా గాయపర్చింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సరిహద్దుతండాకు చెందిన రెండేళ్ల భూక్యా హేమశ్రీ ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ వీధికుక్క పాపను కిందపడేసి తల, ముఖంపై తీవ్రంగా గాయపర్చింది. పాపను కు టుంబ సభ్యులు వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించగారు. వైద్యసిబ్బంది ప్రథమచికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
హనుమకొండలో ఏడుగురికి గాయాలు..
హన్మకొండ: వరంగల్ మహానగరపాలక సంస్థ 57వ డివిజన్ హనుమకొండ గాంధీనగర్ వాసులపై దీపావళి రోజు సోమవారం రాత్రి వీధికుక్కల గుంపు దాడి చేసింది. మొత్తంగా ఏడుగురికి గాయాలయ్యాయి. వారు ఎంజీఎంలో చికిత్స పొందారు. కుక్కలు కరిచిన విషయాన్ని గాంధీనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చెరుకు వెంకట రాజిరెడ్డి స్థానిక కార్పొరేటర్ నల్ల స్వరూపరాణిలు.. మున్సిపల్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ రాజారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మంగళవారం బల్దియా సిబ్బంది కుక్కలను పట్టుకెళ్లారు. కొన్ని వలకు చిక్కకుండా తప్పించుకున్నాయని కాలనీ వాసులు తెలిపారు. మంగళవారం బాధితులను గాంధీనగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు పరామర్శించారు.
కట్య్రాలలో బాలికకు..
వర్ధన్నపేట: వీధి కుక్కల దాడిలో ఓ బాలికకు గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం మండలంలోని కట్య్రాలలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలిక కట్ట వాగ్దేవి తన ఇంటి ఎదుట ఆడుకుంటోంది. ఈ క్రమంలో వీధి కుక్కలు ఆ బాలిక వెంట పడి దాడికి పాల్పడగా గాయపడింది. కాగా, ఈ ఘటనను స్థానికులు చూసి కుక్కలను తరమడంతో బాలిక ప్రాణం దక్కింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ బాలికను వెంటనే వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. బాలికకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. కాగా, రోజురోజుకూ గ్రామంలో వీధి కుక్కల బెడద పెరుగుతోందని, దీనిపై అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తల, ముఖంపై తీవ్రగాయాలు

రెండేళ్ల పాపపై కుక్క దాడి

రెండేళ్ల పాపపై కుక్క దాడి