
పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం
మామునూరు: శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేసి అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి, పోలీసు శిక్షణ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ కె. రమేశ్ పేర్కొన్నారు. మంగళవారం ఖిలా వరంగల్ మండలం మామునూరులోని టీజీఎస్పీ నాలుగో బెటాలియన్, పోలీసు శిక్షణ కళాశాలలో వేర్వేరుగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్తూపాల వద్ద సిబ్బందితో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ రక్షణలో అసువులు బాసిన పోలీసుల సేవలు మరువలేనివన్నారు. విధినిర్వహణలో ప్రజలను రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన అమరుల త్యాగాలను నేటి పోలీసులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తీవ్రవాదుల దుశ్చర్యలతో దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది అమరులయ్యారని, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, విజయ్, భిక్షపతి, సోమాని, ఏఓ కల్పనారెడ్డి, ఆర్‌ఐ చంద్రశేఖర్, మహేశ్, నవీన్, డాక్టర్ సుధీర్, పీఆర్‌ఓ రామాచారి, టీజీఎస్పీఏసీ కృష్ణప్రసాద్, శ్రీనివాస్‌రావు, ఆర్‌ఐలు విజయ్, కార్తీక్, రవి, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
టీజీఎస్పీ నాలుగో బెటాలియన్
కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి ,
పీటీసీ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రమేశ్