
ప్రజాచైతన్యానికి ‘వల్లంపట్ల’ కృషి
విద్యారణ్యపురి: వల్లంపట్ల నాగేశ్వర్‌రావు తన జీవి త కాలమంతా కవిగా, కళాకారుడిగా, సామాజిక స్పృహ.. హేతువాద దృక్పథంతో ప్రజాచైతన్యం కోసం విశేషంగా కృషిచేస్తున్నారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ కొని యాడారు. సోమవారం హనుమకొండలోని టీచర్స్‌కాలనీ ఫేజ్–1లో వల్లంపట్ల నాగేశ్వర్‌రావు 70 వ సంతాల జన్మదిన వేడుకల చైతన్య కార్యక్రమంలో భాగంగా ‘వల్లంపట్ల సప్తతి నవ సమాజ జాగృతి’ అనే శీర్షికన సంవత్సరం పాటు జరుగనున్న చైతన్య కార్యక్రమాల పోస్టర్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. సమాజంలోని మూఢనమ్మకాల నిర్మూలనకు వల్లంపట్ల రూపొందించిన సాహిత్యం కళారూపాలు ప్రాచుర్యం పొందాయన్నారు. కేయూ తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యుడు బన్నఅయిలయ్య మాట్లాడుతూ అర్ధశతాబ్ద కాలంగా వల్లంపట్ల సృజించిన సాహిత్యం పేరెన్నికగన్నది అన్నారు. నవతరం నిర్మాణం కోసం తనవంతు కృషిని అలాగే కొనసాగిస్తానని వల్లంపట్ల నాగేశ్వర్‌రావు తెలిపారు. ప్రగతి మిత్ర అధ్యక్షుడు రాంరెడ్డి, టీచర్స్ కాలనీ కమిటీ బాధ్యులు డోలిరాజలింగం, సత్యనారాయణ, ఇమ్మడి పుల్లయ్య, రతన్‌సింగ్, హరినాథరావు, కవులు, రచయితలు కృష్ణమాచారి, పురుషోత్తం, మహేందర్, శంకర్‌రావు, వల్స పైడి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్