
ఉత్సాహంగా ‘దీపావళి’ బతుకమ్మ
హసన్‌పర్తి : మండలంలోని సీతంపేట గ్రామంలో దీపావళి బతుకమ్మ వేడుకలు మంగళవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన నేతకాని కులస్తులు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మూడ్రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకలను తిలకించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతకాని కులస్తులు ఇక్కడి వస్తారు. ఉత్సవాలను పురస్కరించుకని తొలిరోజు చెరువు వద్దకు వెళ్లి రేగడి మట్టిని సేకరించారు. ఆ మట్టిని ఇంటికి తీసుకొచ్చి జోడెద్దుల రూపం(దేవతామూర్తుల ప్రతిమలు) తయారు చేశారు. గారెలతో వాటిని అందంగా అలంకరించారు. బుధవారం పురుషులు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. జోడెద్దుల ప్రతిమలతో భారీ ప్రదర్శనగా వెళ్లి వాటిని స్థానిక చెరువులో నిమజ్జనం చేయడం ఇక్కడి నేతకాని కులస్తుల సంప్రదాయం.
రేపు బతుకమ్మ వేడుకలు
గురువారం దీపావళి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మహిళలు బతుకమ్మలతో భారీ ప్రదర్శగా వెళ్తారు. పురుషులు కూడా బతుకమ్మలను ఎత్తుకుని మహిళలను అనుసరిస్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేసినట్లు ఎంపీఓ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
నేడు కేదారేశ్వర వ్రతం
రేపు బతుకమ్మ నిమజ్జనం