
అకాలవర్షంతో తడిసిన మక్కలు
కేసముద్రం: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే రైతులకు తిప్పలు తప్పడంలేదు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఓపెన్‌యార్డులో ఆరబోసుకున్న మక్కలు ఆదివారం కురిసిన అకాల వర్షంతో తడిసిముద్దయ్యాయి. మక్కల్లో తేమ ఉండడంతో గత కొద్ది రోజులుగా ఓపెన్‌యార్డులో ఆరబోసుకున్నారు. తీరా మక్కల్లో తేమశాతం తగ్గేలోపు ఒక్కసారిగా అకాలవర్షం కురవడంతో మక్కలు తడిసిపోయాయి. కాగా, రైతుల వద్ద ఉన్న పరదాలు కప్పుకున్నప్పటికీ అడుగుభాగాలు తడిశాయి. వర్షంలో తడిసిన మక్కలను దగ్గరకు చేరుస్తూ, రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

అకాలవర్షంతో తడిసిన మక్కలు