
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వచ్చారు. పాకాల అందాలను వీక్షించి లీకేజీ నీటిలో, పార్కులో సరదాగా గడిపారు. బోటింగ్ చేస్తూ సందడి చేశారు.
రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో ప్రతిభ
విద్యారణ్యపురి : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పీఎన్‌ఎం హైస్కూల్‌లో భారత్ వికాస్ పరిషత్ కమిటీ ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి జాతీయ బృంద గీతాల పోటీల్లో ఓరుగల్లు విద్యార్థులు ప్రతిభ చూపారు. తెలంగాణ రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో 30 పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా తెలుగు, జానపద విభాగం (రూరల్) వరంగల్‌లోని నాగార్జున ప్రైమ్ స్కూల్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. విజేతలకు మెమోంటో, సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ ఎ.వెంకటేశ్వర్లు, బీవీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుధీర్‌కుమార్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, బాధ్యులు వెంకటరెడ్డి తదితరులు ఆదివారం అభినందించారు.
వేయిస్తంభాల ఆలయంలో మాసశివరాత్రి పూజలు
హన్మకొండ కల్చరల్ : రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో ఆదివారం మాసశివ రాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠ అవధాని, అర్చకులు ప్రణవ్, సందీప్‌శర్మ ఉదయం ప్రభాతసేవ, ఉత్తిష్టగణపతికి ఆరాధన గరికపూజ, రుద్రేశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. అనంతరం నాట్యమండపంలో రుద్రేశ్వరిదేవి, రుద్రేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించి కళశ స్థాపన, బాసికధారణ, యజ్ఞోపవితధారణ, పాదప్రక్షాళన, జిలకర బెల్లం, మాంగళ్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి రుద్రేశ్వరిదేవి,రుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. సెలవురోజు కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. సిబ్బంది మధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు.
వనదేవతలకు
భక్తుల మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధికసంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణ కట్టలో పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అన ంతరం భక్తులు మేడారం ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు షెడ్లలో విడిది చేసి వంటా వార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.
భక్తులు సన్మార్గంలో
నడవాలి
హన్మకొండ కల్చరల్ : భక్తులు సన్మార్గంలో నడవాలని సంగారెడ్డి జిల్లా బర్దిపూర్‌కు చెందిన దత్తగిరి పీఠాధిపతి డాక్టర్ సిద్ధేశ్వరానందరావు మహరాజ్ ఉద్బోంధించారు. ఆదివారం ఆయన భద్రకాళి దేవాలయాన్ని సందర్శించగా అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించి పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, తాంబూలం అందజేశారు.

పాకాలలో పర్యాటకుల సందడి

పాకాలలో పర్యాటకుల సందడి

పాకాలలో పర్యాటకుల సందడి

పాకాలలో పర్యాటకుల సందడి