
రెండు గంటలు.. ఎఫ్‌ఓబీ పనులు
మహబూబాబాద్ రూరల్ : మానుకోట రైల్వే స్టేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆదివారం ఎస్కలేటర్, ర్యాంపుతో కూడిన 12 ఫీట్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా ర్యాంపు నిర్మాణ పనులు చేస్తుండగా దానికి అనుసంధానంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా నిర్మించ తలపెట్టారు. కాగా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రత్యేకంగా రెండు భారీ క్రేన్లను తెప్పి ంచారు. రైల్వే ఐఓడబ్ల్యూ జేకే వర్మ ఆధ్వర్యంలో రైళ్ల రాకపోకలు, ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మెగా బ్లాక్ ద్వారా రెండు గంటల్లోనే 12 ఫీట్ల వెడల్పుతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఓబీ నిర్మాణ పనులు పూర్తయితే త్వరలోనే ప్రయాణికులకు ఎస్కలేటర్, ర్యాంపు అందుబాటులోకి రానున్నాయి.
మెగా బ్లాక్ ద్వారా పనుల పూర్తికి చర్యలు
భారీ క్రేన్ల సాయంతో
ఎఫ్‌ఓబీ పిల్లర్ల ఏర్పాటు
త్వరలో అందుబాటులోకి రానున్న
ఎస్కలేటర్, ర్యాంపు