
నేడు ‘దీపావళి’ పండుగ
మహబూబాబాద్ రూరల్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.ఈమేరకు ఆదివారం మానుకోట పట్టణంలో కొనుగోళ్ల సందడి కనిపించింది. పూల దుకాణాల వద్ద ప్రజలు చామంతి, బంతి, కనకాంబరాలు, కాగడాలు, లిల్లీపూల దండలు, విడిపూలు కొనుగోలు చేస్తూ కనిపించారు. షాపుల నిర్వాహకులు ప్రత్యేకంగా గజమాలలు కూడా కట్టి సిద్ధంగా ఉంచారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో భక్తులు ప్రమిదలను కొనుగోలు చేశారు. సంప్రదాయం ప్రకారం భక్తులు భక్తిశ్రద్ధలతో తమ ఇళ్లలో ధనలక్ష్మి అమ్మవారు, కేదారేశ్వర స్వామివారి వ్రతాలను ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బాణసంచా కాల్చేందుకు సిద్ధమయ్యారు.

నేడు ‘దీపావళి’ పండుగ