
తల్లుల పోరాటం అందరికీ స్ఫూర్తి
గోదావరిలో యువకుడి గల్లంతు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక గ్రామానికి చెందిన ఓ యువకుడు గోదావరి నదిలో గల్లంతయ్యాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాషా గోదావరి లంకల్లో పుచ్చతోట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పుచ్చతోటను చూసి వచ్చేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గోదావరిలోని నీటి మడుగును దాటేక్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి లోతుకు వెళ్లి గల్లంతయ్యాడు. దీంతో పాషా కోసం గ్రామస్తులు నాటు పడవల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ పోరాటం అందరికీ స్ఫూర్తి అని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అవధూతగిరి మహారాజ్, మహామండలేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు. ఆదివారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులు దేశ ప్రజల సుఖశాంతుల కోసం వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మ ధర్మం, ధైర్యం, త్యాగం నేటి తరానికి స్ఫూర్తి అన్నారు. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతర ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు అభినందనీయమన్నారు. సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో ప్రతీ ఒక్కరు తమ జీవితాన్ని ధర్మమార్గంలో నడిపితే సమాజంలో శాంతి, సౌభ్రాతత్వం నెలకొంటుందని తెలిపారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, పూజారులు సిద్ధబోయిన ముణిందర్, జూనియర్ అసిస్టెంట్లు మధు, జగదీశ్వర్ పాల్గొన్నారు.
13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
దత్తగిరి పీఠాధిపతులు అవధూతగిరి, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్

తల్లుల పోరాటం అందరికీ స్ఫూర్తి