
కానిస్టేబుల్ శ్రమ వృథా..
● గంటలోనే దూరమైన సంతోషం
● బైక్ పైనుంచి పడిన వ్యక్తి మృతి
దంతాలపల్లి : ఓ వ్యక్తిని గంటపాటు కష్టపడి సీపీఆర్ చేసి బతికించిన కానిస్టేబుల్ శ్రమ వృథా అయ్యింది. బతికాడనుకున్న వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతిచెందాడు. దీంతో గంటలోనే ఆ సంతోషం దూరమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెద్దముప్పారం గ్రామానికి చెందిన తల్లాడి లక్ష్మయ్య, నాగమ్మ దంపతుల కు మారుడు ఉమేశ్ (42) పని నిమిత్తం బైక్‌పై ఆ దివారం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జి కొత్తపల్లి గ్రామానికి వెళ్తున్నాడు.ఈ క్ర మంలో మండలంలోని దాట్ల గ్రామ సమీపాన బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. ఇదే సమయంలో దంతాలపల్లి పీఎస్ కానిస్టేబుల్ కొయేడి శ్రీను ఓ కేసు విషయంలో దాట్లకు వచ్చాడు. ఈ క్రమంలో ఉమేశ్ బైక్ నుంచి పడ్డాడనే విష యం తెలిసింది. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఉమేశ్‌ను గంటపాటు కష్టపడి సీపీఆర్ చేసి బతికించా డు. అనంతరం మెరుగైన చి కిత్స కోసం 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా ఉమేశ్ మార్గమధ్యలో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.