
వేగంగా సాంకేతికత అభివృద్ధి
● ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి
హసన్‌పర్తి: నేటి ఆధునిక యుగంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి అన్నారు. అన్నాసాగరం శివారులోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వరదారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ జీవితంలో కొత్త ప్రారంభమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థినులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈసందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుదర్శన్, డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ శ్రీవాణి, ఏఓ వేణుగోపాల్, కార్యక్రమ కో–ఆర్డినేటర్లు ఝాన్సీరాణి, ఎస్.శ్వేత తదితరులు పాల్గొన్నారు.