
హైదరాబాద్–గోరఖ్‌పూర్ వీక్లీ రైళ్ల రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే హైదరాబాద్–గోరఖ్‌పూర్–హైదరాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నవంబర్ 28వ తేదీ నుంచి 2026 సంవత్సరం జనవరి 2వ తేదీ వరకు రద్దు చేస్తునట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. నార్త్ సెంట్రల్ రైల్వేలోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్, ప్లాట్‌ఫాం పనులు చేపడుతున్న కారణంగా రైళ్లను రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
రైళ్ల రద్దు వివరాలు
2025 నవంబర్ 28వ తేదీ నుంచి 2026 జనవరి 2వ తేదీ వరకు హైదరాబాద్–గోరఖ్‌పూర్ (07075) వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్, నవంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు గోరఖ్‌పూర్–హైదరాబాద్ (07076) వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో తెలిపారు.