
కూలీల ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు
● గిరిపురం క్రాస్ వద్ద ఘటన
మరిపెడ రూరల్: ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను తప్పించబోయి కూలీల ఆటో బోల్తా పడింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి మరిపెడ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామం నుంచి కూలీ పనుల నిమిత్తం 14 మంది ఆప్పి ఆటోలో సూర్యపేట జిల్లా నూతనకల్ మండలానికి మరిపెడ మండలం మీదుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో గిరిపురం క్రాస్ రోడ్డు వద్ద మరిపెడ నుంచి గిరిపురం వైపు వస్తున్న ఓ ట్రాలీ ఆటో సడన్‌గా ఎదురు రావడంతో కూలీల ఆటో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మందిలో మంగమ్మ, మమత, అనసూర్య, మల్లయ్య, భిక్షమమ్మ, సుగుణమ్మతోపాటు మరొకరికి గాయాలు కాగా, ఇందులో ఒకరికి కాలు విరిగింది. దీంతో స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పరిమితికి మంచి ప్రయాణం
ఏడుగురితో ప్రయాణించాల్సిన ఆటోలో పరిమితికి మించి 14 మందిని తరలించడంతో అదుపుతప్పి పల్టీ కొట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికై నా పోలీసులు స్పందించి అడ్డుగోలుగా ప్రయాణికులకు ఎక్కించుకుంటున్న ఆటోలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కూలీల ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు