
ఏజెన్సీలో అరుదైన గద్దజాతి పక్షి ప్రత్యక్షం
● పొలాల్లో వాలిన నల్ల రెక్కల గాలిపటం (కపసి)
వాజేడు: ఏజెన్సీ ప్రాంతంలో అరుదైన గద్దజాతి పక్షి కనిపించింది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధి ఇప్పగూడెం గ్రామ సమీపంలోని పొలాల్లో నల్ల రెక్కల గాలిపటం (కపసి) పక్షి వాలింది. దీని శాసీ్త్రయనామం ఎలనల్ కెరులియస్. పొడవైన రెక్కలు కలిగిన రాప్టర్, ఇది ప్రధానంగా బూడిదరంగు లేదా తెలుపు రంగులో ఉంది. ఈ పక్షిని గ్రామస్తులు వింతగా చూడటంతోపాటు తమ సెల్ ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. ఎర్రని కళ్లు, రెక్కలు విప్పగానే నెమలి రెక్కల వలే పెద్దగా ఉన్నాయి. ఈ పక్షి రాత్రి సమయంలో మనుషులు అరిచినట్లుగా అరుస్తున్నట్లు ఇప్పగూడెం గ్రామస్తులు తెలిపారు. ఈ పక్షిని అడవి రామదాసు అనికూడా పిలుస్తారని తెలుస్తుండగా, దీని ఆహారంలో మిడతలు, ఇతర పెద్ద కీటకాలు, బల్లులు, ఎలుకలు ఉంటాయని, ఇది రైతులకు మేలు చేకూర్చే పక్షిగా తెలిసింది.

ఏజెన్సీలో అరుదైన గద్దజాతి పక్షి ప్రత్యక్షం