
ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు కృషి
వరంగల్ స్పోర్ట్స్: భారత్‌లో 2036లో జరుగనున్న ఒలింపిక్స్ పోటీల్లో కొన్ని క్రీడలను తెలంగాణలో నిర్వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజులు జరుగనున్న జాతీయస్థాయి 5వ అథ్లెటిక్స్ అండర్–23 చాంపియన్‌షిప్ గురువారం ప్రారంభమైంది. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎంపీ కావ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2026లో జరుగనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ రూ.3.50 కోట్ల వ్యయంతో స్టేడియంలో అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలో ఫ్లడ్‌లైట్లు ఇతర వసతుల కోసం మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నాయన్నారు. మెరుగైన శిక్షణ కోసం క్రీడాకారులు పట్టుదలతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం 10వేల మీటర్ల పరుగులో విజేతలకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, కార్యదర్శి కె. సారంగపాణి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య
జేఎన్‌ఎస్‌లో నేషనల్ అథ్లెటిక్స్
మీట్ ప్రారంభం

ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు కృషి

ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు కృషి

ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు కృషి