
రాష్ట్ర స్థాయి బాలికల వాలీబాల్ పోటీలకు జిల్లా జట్టు ఎం
వరంగల్ స్పోర్ట్స్: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్న ఎస్‌జీఎఫ్ అండర్–19 రాష్ట్ర స్థాయి బాలికల వాలీబాల్ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. గురువారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని వాలీబాల్ మైదానంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. 120 మంది బాలికలు హాజరుకాగా, ఇందులో ప్రతిభ కనబరిచిన 12మందితో ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ బరుపాటి గోపి, ఎస్‌జీఎఫ్ అండర్–19 మాజీ కార్యదర్శి డాక్టర్ కోట సతీశ్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి దరిగి కుమార్, డీఎస్‌ఏ వాలీబాల్ కోచ్ బత్తిని జీవన్‌గౌడ్ పాల్గొన్నారు.
ఎంబీఏ, ఎంసీఏలో
స్పాట్ అడ్మిషన్లు
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్‌కళాశాల, సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం(2025–2026)లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎస్. జ్యోతి, నర్సింహాచారి గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈ నెల 17నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని విద్యార్హతల ఒరిజనల్ సర్టిఫికెట్లుతోపాటు ఆధార్, ఐసెట్ ర్యాంకు కా ర్డును తీసుకురావాలన్నారు. టీజీఐసెట్ 2025 అర్హత సాధించినవారు, అర్హతసాధించలేకపోయిన అభ్యర్థులు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లకు అర్హులేనని వారు తెలిపారు. పూర్తి వివరాలకు టీజీఐసెట్.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు. కళాశాలల వారీగా మిగిలిన సీట్ల వివరాలు మార్గదర్శకాలు కూడా ఆ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
బాటనీ హెచ్‌ఓడీతోపాటు కాంట్రాక్టు లెక్చరర్లకు షోకాజ్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ బాటనీ విభాగం అధిపతితోపాటు నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు, నలుగురు నాన్‌టీచింగ్ ఉద్యోగులకు షోకాజ్ నోటీస్‌లు జారీచేసినట్లు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ గురువారం తెలిపారు. ఇటీవల వీసీ ప్రతాప్‌రెడ్డి బాటనీ విభాగాన్ని తనిఖీ చేయగా ఆవిభాగ అధిపతితో సహా నలుగురు కాంట్రా క్టు లెక్చరర్లు, మరో నలుగురు నాన్‌టీచింగ్ ఉద్యోగులు విధుల్లో లేరనే విషయం వెల్లడైందన్నారు. దీంతో వారికి షోకాజ్ నోటీస్‌లు జారీచేసినట్లు తెలిపారు. ఇదిలాఉండగా గురువారం కేయూలోని అకడమిక్ కమిటీహాల్‌లో వీసీ ప్ర తాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం బాటనీ విభాగం అధిపతి, కాంట్రాక్టు లెక్చరర్లతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. విధుల్లో సమయపాలన పాటించాలనే విషయం, తరగతుల నిర్వహణ, తదితర అంశాలపై చర్చ సాగినట్లు తెలిసింది.

రాష్ట్ర స్థాయి బాలికల వాలీబాల్ పోటీలకు జిల్లా జట్టు ఎం

రాష్ట్ర స్థాయి బాలికల వాలీబాల్ పోటీలకు జిల్లా జట్టు ఎం