క్రీడాకారులకు గాయాలు.. 108లో ఎంజీఎంకు తరలింపు | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు గాయాలు.. 108లో ఎంజీఎంకు తరలింపు

Oct 17 2025 6:14 AM | Updated on Oct 17 2025 6:14 AM

క్రీడాకారులకు గాయాలు.. 108లో ఎంజీఎంకు తరలింపు

క్రీడాకారులకు గాయాలు.. 108లో ఎంజీఎంకు తరలింపు

మొదటి రోజు 11 ఈవెంట్లు పూర్తి..

జేఎన్‌ఎస్‌లో జరుగుతున్న అథ్లెటిక్స్‌ పోటీల్లో ఇద్దరు క్రీడాకారులు, ఒక టెక్నికల్‌ అఫీషియల్‌ గాయపడ్డారు. హరియాణ రాష్ట్రానికి చెందిన సోనూయాదవ్‌ లాంగ్‌జంప్‌ చేస్తుండగా ఎడమకాలు మణికట్టులో గాయమైంది. మరో క్రీడాకారిణి త్రివేణికి సైతం మణికట్టులో స్వల్ప గాయం కాగా అక్కడే విధుల్లో ఉన్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఈఎంటీ చైతన్య, పైలెట్‌ కొండ తిరుపతి లు ఎంజీఎం తరలించారు. కాగా, టెక్నికల్‌ అఫీషియల్‌ శివకుమార్‌ కుడి చేయి మధ్య వేలుకు గాయం కాగా చికిత్స అందించారు.

చాంపియన్‌షిప్‌లో భాగంగా మొదటి రోజు గురువారం 30 ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10: 30 గంటల వరకు, తిరిగి 12 నుంచి సాయంత్రం 6:30గంటల వరకు పోటీలు జరిగాయి. 30 ఈవెంట్లలో 11 ముగిశాయి. మిగిలిన ఈవెంట్లు శుక్రవారం కొనసాగుతాయి.

10,000 మీటర్ల పురుషుల పరుగు : రిజ్వాన్‌(ఇండోర్‌) ప్రఽథమ స్థానం, సచిన్‌యాదవ్‌(ఉత్తర్‌ప్రదేశ్‌) ద్వితీయ, శివాజీకాశీరామ్‌(కర్నాటక) తృతీయ స్థా నంలో నిలిచారు. 10000 మీటర్ల మహిళల విభాగం: లతికతల్వార్‌(రాజస్తాన్‌) ప్రథమ స్థానం, ఆర్తిపవారా(మహారాష్ట్ర) ద్వితీయ, భూష్రాగౌరి(మధ్యప్రదేశ్‌)తృతీయ స్థానం, షార్ట్‌ఫుట్‌ మహిళల విభాగం: సిమ్రాన్‌జిత్‌కౌర్‌(ఢిల్లీ) ప్రథమ స్థానం, ఝలక్‌చా హల్‌(ఉత్తర్‌ప్రదేశ్‌)ద్వితీయ,పూజకుమారి(ఎన్‌సీఓ పీ) తృతీయ స్థానం, హైజంప్‌ మహిళల విభా గం: సీమకుమారీ(ఉత్తర్‌ప్రదేశ్‌) ప్రథమ స్థానం, సారి కకుమావత్‌(రాజస్తాన్‌)ద్వితీయ, రింపల్‌కౌర్‌(పంజాబ్‌)తృతీయ స్థానం, డిస్కస్‌త్రో మహిళల విభా గం: నిఖితకుమారి(ఎన్‌సీఓపీ, ఆర్గనైజేషన్‌ ) మొదటిస్థానం, కిరణ్‌(రాజస్తాన్‌)ద్వితీయ, అఖిలరాజు(కేరళ)తృతీయ స్థానం, హ్యామర్‌త్రో పురుషుల వి భాగం: దినేశ్‌ ఎస్‌(తమిళనాడు) ప్రథమ స్థా నం, పవన్‌(రాజస్తాన్‌) ద్వితీయ, రాబిన్‌యాదవ్‌(ఉత్తర్‌ప్రదేశ్‌) తృతీయ స్థానం, పోల్‌వాల్ట్‌ విభాగం: కు మార్‌కుల్దీప్‌(జేఎస్‌డబ్ల్యూ,ఆర్గనైజేషన్‌) ప్రథమ, క వీన్‌రాజ్‌(తమిళనాడు)ద్వితీయ,రామ్‌రాజన్‌(రాజస్తాన్‌) తృతీయ స్థానం, 100మీటర్ల పరుగు మహిళ ల విభాగం: సుదీష్న(మహారాష్ట్ర) విజేత, సాక్షి(రిలయన్స్‌, ఆర్గనైజేషన్‌) ద్వితీయ, తమన్నా(త్రివేండ్రం) తృతీయ స్థానం, 100మీటర్ల పరుగు పురుషుల విభాగం: హరుత్యమ్‌జయరామ్‌(ఒడిశా) ప్రథమ, కుమార్‌(జార్ఖండ్‌)ద్వితీయ, రాట్‌మెల్గే(మహారాష్ట్ర) తృతీయ స్థానం, లాంగ్‌జంప్‌ మహిళల విభాగం: ముబాస్సిమ్‌(అంజుబాబీ, ఆర్గనైజేషన్‌) ప్రథమ, ఎంఎస్‌ సించానా(కర్నాటక)ద్వితీయ, వీఎం అభిరామ్‌(కేరళ)తృతీయ స్థానం, 1500 మీటర్ల పరుగు మహిళల విభాగం: వినీతగుర్జర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) ప్రథ మ, లక్ష్మిప్రియకిసాన్‌(ఒడిశా) ద్వితీయ, భగవతిడియోరా(రాజస్తాన్‌)తృతీయ స్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement