
వ్యవసాయ రంగానికి పెద్దపీట
హన్మకొండ: వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారి అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తున్నట్లు వివరించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 2023 సంవత్సరంలో 31,550 రిలీజ్ చేయగా 2024 సంవత్సరంలో 39,693 సర్వీసులను రిలీజ్ చేశామని, 2025 (అక్టోబర్ 16 వరకు ) 34,306 సర్వీస్‌లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 2023తో పోల్చుకుంటే 2024 సంవత్సరంలో 8,143 సర్వీస్‌లు అఽధికంగా మంజూరు చేసినట్లు వివరించారు. ఇంకా మూడు నెలల సమయంలో ఉందని ఈలోపు గతంలోకంటే అధికంగా సర్వీస్‌లు మంజూరు చేస్తామన్నారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కొత్తగా లైన్లు వేయాల్సిన అవసరం లేని సర్వీసులను నెల రోజుల్లో మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ వాటా చెల్లించాల్సి ఉన్న సర్వీసులను రెండు నెలలో మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ సర్వీస్‌ల మంజూరుపై కమర్షియల్ విభా గాధికారులు 16 సర్కిళ్ల అధికారులతో ప్రతీ వారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు, మెటీరియల్ కొరత లేదని పేర్కొన్నారు. రైతులు మెటీరియల్ కొనాల్సిన అవసరం లేకుండా అవసరమైన మేరకు సరఫరా చేస్తున్నమని స్పష్టం చేశారు. సర్వీస్‌ల మంజూరులో ఇబ్బందులుంటే టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని కోరారు.
విద్యుత్ కనెక్షన్ల జారీలో
పారదర్శకత..
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీలో మరింత పారదర్శకత తీసుకొచ్చామని, కొత్త కనెక్షన్ కోసం నమోదు చేసుకున్నప్పటి నుంచి సర్వీస్ రిలీజ్ అయ్యే వరకు ప్రతీ దశలోనూ మొబైల్ నంబర్‌కు తెలుగులో సమాచారం పంపిస్తున్నట్లు తెలిపారు. ఈమెస్సెజ్‌లో లింక్ కూడా పంపిస్తుండడంతో దాన్ని ఓపెన్ చేస్తే స్టేటస్ రిపోర్ట్ రైతులు తెలుసుకోవచ్చని సూచించారు. మెటీరియల్ త్వరితగతిన రిలీజ్ అయ్యేలా ఈ–స్టోర్ విధానాన్ని తీసుకొచ్చామని, పేపర్ పని లేకుండా ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసి మెటీరియల్ డ్రా చేసుకునే సౌలభ్యం క్షేత్ర స్థాయి అధికారులకు కల్పించిందని, దీంతో రైతుల సర్వీ సుల మంజూరు వేగంగా జరుగుతుందని తెలిపా రు. ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపునకు డిపార్ట్‌మెంట్ వా హనాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పొలం బాట ద్వారా రైతుల ముంగిటకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇప్ప టి వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలో 4,064 పొలం బాట కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు.
సత్వర సర్వీస్‌లు మంజూరు
టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి