
భర్తను కాపాడబోయి భార్య హతం
నల్లబెల్లి: ఇంటి స్థలం పంపకం, అప్పు వివాదానికి మద్యం మత్తు తోడుకావడంతో అన్నదమ్ముల మ ధ్య ప్రేమానుబంధం దూరమైంది. అన్నపై త మ్ముడు కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్ప డ్డాడు. ఈ సమయంలో తన భర్త ప్రాణం తీయొద్దని వదిన ప్రాధేయపడింది. అయినా కనికరించని మరిది.. వదినపై సైతం కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భర్తను కాపాడిన భార్య.. తన ప్రా ణం వదిలింది. తీవ్రంగా గాయపడిన అన్న ప్రాణా పాయ స్థితిలో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నా డు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్‌లో జరిగింది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. మేరుగుర్తి మల్లయ్య, సమ్మక్క దంపతులు బతుకుదెరువు నిమిత్తం 30 ఏళ్ల క్రితం నల్లబెల్లి నుంచి కొండాపూర్‌కు వలసవెళ్లారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు రమేశ్, సురేశ్ ఉ న్నారు. ఈ క్రమంలో ఇంటి స్థలం పంపకాల విషయంలో బుధవారం రాత్రి రమేశ్ తల్లి సమ్మక్కతో గొడవపడ్డాడు. అమ్మతో ఎందుకు గొడవ పడుతున్నావని తమ్ముడు సురేశ్ అన్న రమేశ్‌ను నిలదీశా డు. అలాగే, తన దగ్గర తీసుకున్న రూ.10 వేలు ఇవ్వడంలేదని మనసులో పెట్టుకుని మద్యం మత్తులో రమేశ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన రమేశ్ భార్య (సహజీవనం చే స్తున్న మహిళ) స్వరూప(35) అడ్డుకునేయత్నం చే సి బతిమాలాడింది. కానీ మద్యం మత్తులో ఉన్న సురేశ్ ఏమాత్రం కనికరం లేకుండా ఆమైపె కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడడంతో కుటుంబీకులు నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. రమేశ్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. దీంతో కొండాపూర్, నల్ల బెల్లిలో విషాదం అలుముకుంది. స్వరూప కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అన్నపై తమ్ముడు కత్తితో దాడి..
అడ్డు వెళ్లిన వదినపై కూడా దాడికి పాల్పడడంతో మృతి
కొండాపూర్‌లో విషాదం

భర్తను కాపాడబోయి భార్య హతం