
బ్యాటరీ దొంగల ముఠా అరెస్టు
● వివరాలు వెల్లడించిన ఏసీపీ రవీందర్‌రెడ్డి
నర్సంపేట రూరల్ : బ్యాటరీ దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం నర్సంపేట పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాలకుర్తికి చెందిన గుంజే సంపత్, గుంజే ప్రశాంత్, జఫర్‌గఢ్ మండలం తీగారం గ్రామానికి చెందిన గండికోట మహేశ్, బోసు సాంబరాజు ముఠాగా ఏర్పడ్డారు. నర్సంపేట మండలంలోని పలుగ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో సోలార్ విద్యుత్ దీపాలకు ఉన్న బ్యాటరీలను అపహరిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున రాజుపేటలో బ్యాటరీలు చోరీ చేసేందుకు అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఇందులో రూ. 2.15 లక్షల విలువైన 38 బ్యాటరీలు లభించగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. నర్సంపేట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు రవికుమార్, గూడ అరుణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.