
విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి
విద్యారణ్యపురి: విద్యార్థులు కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన నైపుణ్యాలను పెంచుకోవాలని, తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుర్రం శ్రీనివాస్ తెలిపారు. కళాశాలలో కెరీర్ గైడెన్స్ సెల్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో స్కిల్ ఇండియా డిజిటల్ పోటీల ఉచిత కోర్సులపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ స్కిల్ ఇండియా హబ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ హరీశ్, శ్రావణి పాల్గొని స్కిల్ ఇండియా కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, కెరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ యాకూబ్, కామర్స్ విభాగం అధిపతి డాక్టర్ జె.చిన్నా, అధ్యాపకులు బైరి శ్రీనివాస్, ఉమాదేవి, శివనాగ శ్రీను, అనిల్‌కుమార్, గంగిశెట్టి శ్రీనివాస్, నవీన్, బాలచందర్, మాధవ్ శంకర్, వందన, సునీత తదితరులు పాల్గొన్నారు.