
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
–8లోu
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పీజీఆర్ గార్డెన్‌లో మాత యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా సీఎంతోపాటు మంత్రులు, ఉమ్మడిజిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముందుగా కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు చల్లి మాధవరెడ్డిని పరామర్శించారు. అంతకుముందు సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
– సాక్షిప్రతినిధి, వరంగల్
మహబూబాబాద్: ఖరీఫ్ ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు సంబంధిత అధికారులను ఆదేఽశించారు. బుధవారం వారు హైదరాబాద్ నుంచి మంత్రి వాకాటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ధాన్యం కొనుగోలు తదితర విషయాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అధికారులను హెచ్చరించారు. మంత్రులతో వీడి యో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అౖద్వైత్‌కుమార్ సింగ్ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. గన్ని బ్యాగులు, టార్పాలిన్లు, ఇతరత్రా అన్ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పా రు. జిల్లాలో ఐకేపీ 59, పీఏపీఎస్ 168, జీసీసీ 13, మెప్మా 2 మొత్తం 242 కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల వద్ద రైతుల కోసం తాగునీరు, వైద్యశిబిరాలు, తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో డీసీఓ వెంకటేశ్వర్లు, డీసీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీఏఓ విజయనిర్మల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ఉత్తమ్, తుమ్మల
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్