
పార్టీ అభివృద్ధికి కృషిచేసే వారికి గుర్తింపు
● ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్
మహబూబాబాద్ రూరల్ : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడేవారికి గుర్తింపు లభిస్తుందని ఏఐసీసీ పరిశీలకుడు దెబాసిస్ పట్నాయక్ జి అన్నారు. మా నుకోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో ఎమ్మె ల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్‌రెడ్డి, టీపీసీసీ పరిశీలకులు శ్రీకాంత్ యాదవ్, అవేజ్, టీపీసీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ గౌడ్, అజ్మీరా సురేష్, రవి పాల్గొన్నారు.
అందరి అభిప్రాయాల మేరకే అధ్యక్షుడి ఎంపిక
తొర్రూరు: డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో పార్టీ శ్రేణులందరి అభిప్రాయాల మేరకే అధిష్టానానికి నివేదిక అందిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు దేబాశిష్ పట్నాయక్ అన్నారు. డివిజన్ కేంద్రంలో బుధవారం పాలకుర్తి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. దేశ ప్రజలకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని, ఓటు హక్కును అందిస్తే ఈ వ్యవస్థలను బీజేపీ నీరుగారుస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో నియోజకవర్గానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు ఎండీ అవేజ్, శ్రీకాంత్ యాదవ్, అరుణ్‌కుమార్‌గౌడ్, నాయకులు ము త్తినేని సోమేశ్వరరావు, మేకల కుమార్, పెద్దవంగర అధ్యక్షులు ముద్దసాని సురేష్ పాల్గొన్నారు.