
మక్క రైతుల పడిగాపులు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నలను విక్రయించేందుకు తీసుకొచ్చిన రైతులకు బుధవారం పడిగాపులు తప్పలేదు. ఈనాం విధానంలో కొనుగోళ్లు ప్రారంభించగానే సర్వర్ డౌన్ సమస్య తలెత్తడంతో సాయంత్రం నాలుగు గంటల వరకు విన్నర్ లిస్టు బయటకురాలేదు. దీంతో రైతులందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్లోనే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోళ్ల అలస్యంతో బస్తాలు నింపడం, కాంటాలు పెట్టడంలో తీవ్ర జాప్యం జరిగి మొక్కజొన్నలు మార్కెట్ నుంచి లారీల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లలేదు. దీంతో రైతుల ట్రాక్టర్లు వ్యవసాయ మార్కెట్ ప్రధాన ద్వారం వద్ద నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. రాత్రి పొద్దుపోయే వరకు మార్కెట్ అధికారులు మొక్కజొన్నలను కాంటాలు పెట్టించి లారీల్లో తరలించి మార్కెట్ బయట ఉన్న మొక్కజొన్నల ట్రాక్టర్లను లోనికి అనుమతించారు.
మార్కెట్ ఎదుట క్యూ కట్టిన మక్కల ట్రాక్టర్లు