
ప్రారంభమైన ఎస్‌జీఎఫ్ క్రీడలు
మహబూబాబాద్ అర్బన్: ఎస్‌జీఎఫ్ క్రీడలపై ‘తూతూ మంత్రంగా క్రీడా పోటీలు’ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం మండల స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు ఎస్‌జీఎఫ్‌ఐ కమిటీ సభ్యులు, పీడీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శీలం వెంకటేవ్వర్లు హాజరై మాట్లాడుతూ.. క్రీడలతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో తప్పనిసరిగా చదువుతోపాటు క్రీడలు నిర్వహించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యాక్రమంలో పీడీలు, పీఈటీలు చాంప్లానాయక్, పుష్పలలీ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, నజీరుద్దీన్, శంకర్, రాజన్న, సుదర్శన్, ఇస్మాయిల్, రఘు పాల్గొన్నారు.

ప్రారంభమైన ఎస్‌జీఎఫ్ క్రీడలు