
బలపాల పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
కురవి: మండలంలోని బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్‌పేషెంట్ విభాగాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం రికార్డులను పరిశీలించి, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సేవా ధోరణి, రికార్డు ల నిర్వహణ, ఔషధాల సరఫరా, శుభ్రత, వ్యాధి నివారణ చర్యలపై సమీక్ష జరిపారు. పీహెచ్‌సీకి వచ్చే రోగులతో మర్యాదగా, సేవాభావంతో వ్యవరించాలని ఆదేశించారు. పరిశుభ్రత, ల్యాబ్ సేవలు, మాతా,శిశు ఆరోగ్య సేవలు, వ్యాక్సినేషన్, ప్రజా ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారిణి స్రవంతి, అనిల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.