
మక్క రైతులకు తేమ కష్టాలు..
కేసముద్రం: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే రైతులకు గోస తప్పడంలేదు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు వారం కిత్రం మక్కలను తీసుకొచ్చారు. అయితే మక్కలలో తేమ ఉందని, తాము కొనుగోలు చేయలేమని వ్యాపారులు తెలపడంతో రైతులు ఓపెన్ యార్డుల్లో ఆరబోసుకున్నారు. తీరా తేమశాతం తగ్గేదశలో సోమవారం కురిసిన వర్షంతో మక్కలు తడిసిముద్దయ్యాయి. దీంతో మంగళవారం ఆరబెట్టుకుంటూ రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇదే అదును గా కొందరు వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. రోజుల తరబడి పడిగాపులు పడలేక కొందరు రైతులు వ్యాపారులు పెట్టిన ధర క్వింటాకు రూ.1,800నుంచి రూ.2వేల లోపు అమ్ముకుంటూ నష్టపోతున్నారు. కాగా మంగళవారం 5వేల బస్తాలు అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ట ధర రూ. 2,176, కనిష్ట ధర రూ.1,829 పలికినట్లు అధికారులు తెలిపారు.