
అన్‌మ్యాన్డ్ వర్కర్ కుటుంబానికి ఆర్థిక సాయం
హన్మకొండ: విధి నిర్వహణలో ప్రాణం కోల్పోయిన టీజీ ఎన్పీడీసీఎల్ అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గట్ల కరుణాకర్ రెడ్డి కుటుంబానికి ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. మహబూబాబాద్ మండలం ఈదులపూసలపల్లి గ్రామానికి చెందిన అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గట్ల కరుణాకర్ రెడ్డి విధి నిర్వహణలో ప్రాణం కోల్పోయాడు. కాగా, మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కరుణాకర్ రెడ్డి భార్య ప్రియాంకకు సీఎండీ రూ. 20 లక్షల బీమా చెక్కు అందించారు. కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, న్యూఇండియా ఎష్యు రెన్సు కంపెనీ హనుమకొండ డివిజినల్ ఆఫీస్ సీనియర్ డివిజనల్ మేనేజర్ నాగభట్ల జ్యోతిర్మయి, మార్కెటింగ్ మేనేజర్ రాజేశ్, కాంట్రాక్టర్ సైదులు, తదితరులు పాల్గొన్నారు.