
ఎమ్మెల్యే ‘దొంతి’కి మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శ
నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం రాత్రి పరామర్శించారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మంత్రి శ్రీధర్‌బాబు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి గాజర్ల అశోక్‌కుమార్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం వేర్వేరుగా కాంతమ్మ చిత్ర పటం వద్ద నివాళులర్పించి ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించారు.