
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా..
నర్సంపేట రూరల్ : తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి రి మాండ్‌కు తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూ బాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, ఆర్టీసీ కాలనీకి చెందిన మాదాసు నవీన్, మాదాసు భార్గవి, భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కొండైగూడెం గ్రామానికి చెందిన కుంజా విజయ, పాల్వంచకు చెందిన బత్తుల రాజేశ్వరి ముఠాగా ఏర్పడి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. సెప్టెంబర్ 20న పాకాల సెంటర్‌లోని తాళం వేసి ఉన్న షాపులో నగలు అపహరించారు. అలాగే, ఆగస్టులో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రామాలయం దగ్గర రైల్వే క్వార్టర్స్‌లోని ఓ ఇంట్లో, అదే నెల రెండో వారంలో ఖానా పురం మండలం బుధరావుపేటలోని ఓ ఇంట్లోకి చోరీకి పాల్ప డ్డారు. అనంతరం అపహరించిన బంగారు, వెండి వస్తువులను విక్రయించేందుకు మహబూబాబాద్ నుంచి నర్సంపేట మీదుగా వరంగల్ వెళ్తున్నారు. ఇందులో మహమ్మద్ ఇమ్రాన్ ద్విచక్రవాహనంపై, మిగతా నలుగురు ఆటోలో వెళ్తున్నారు. ఈ సమయంలో వీరిపై అనుమానం కలగడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద నుంచి మొత్తం రూ. 4 లక్షల 30 వేల విలువైన ద్విచక్రవా హనం, ఆటో, 5 సెల్‌ఫోన్లు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు రవికుమార్, గూడ అరుణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్
బంగారం, వెండి ఆభరణాలు,
ఆటో, బైక్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన పోలీసులు