
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్ : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం అందించే ఆర్థిక చేయూతను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈమేరకు మంగళవారం వరంగల్ 35వ డివిజన్ శివనగర్‌లోని సాయి కన్వెన్షన్ హాల్‌లో తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్ అధ్యక్షతన వరంగల్, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పులో 500 మందికి పైగా లబ్ధిదారులకు రూ.5,30,61,480 విలువైన కల్యాణాలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, రూ.35,37,700 విలువైన సీఎ రిలీఫ్ ఫండ్ చెక్కులతోపాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు ధ్రువ పత్రాలు అందజేశామని తెలిపారు. డీఆర్‌ఓ విజయలక్ష్మి, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్నా రాణి, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, పోశాల పద్మ, చింతాకుల అనిల్, దిడ్డి కుమారస్వామి, కావేటి కవిత, పల్లం పద్మ, గుండు చందన ,నాయకులు శామంతుల శ్రీనివాస్, గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు.
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ