
అథ్లెట్లకు అసౌకర్యం కలగొద్దు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా మూడు రోజులపాటు జరుగనున్న జాతీయస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు హాజరయ్యే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు అండర్–23 నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరుగనున్న నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మేయర్ సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యి మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ మీట్‌ను విజయవంతంగా పూర్తి చేయాలని, క్రీడాకారులకు తాగునీరు, వైద్యం, పరిశుభ్రత, లైటింగ్ తదితర సౌకర్యాలను కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఎంహెచ్‌ఓ రాజిరెడ్డి, ఈఈ రవీందర్, డీఈ సారంగం, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
16 నుంచి జాతీయస్థాయి అథ్లెటిక్స్ మీట్
జేఎన్‌ఎస్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్