
ఆమెకు సుస్తీ!
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
● జిల్లాలో స్వస్త్ నారీ..
సశక్తి పరివార్ కార్యక్రమం అమలు
● మహిళలకు ప్రత్యేక పరీక్షల నిర్వహణ
● సీ్త్రలు పలురకాల వ్యాధులతో
బాధపడుతున్నట్లు వెల్లడి
ఆమెకు సుిస్తీ!
సాక్షి, మహబూబాబాద్: ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అంటారు. ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండే విధంగా సేవలు అందిస్తారు. మహబూబాబాద్ లాంటి మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జిల్లాలో మహిళలలు ఇంటి పనికే పరిమితం కాకుండా పురుషులతో సమానంగా వ్యవసాయ పనులు చేస్తారు. దీంతో వారి ఆరోగ్యంపై పట్టింపు ఉండదు. దేశవ్యాప్తంగా మహిళలు వివిధ రకాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. స్వస్త్ నారీ.. సశక్తి పరివార్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని మహిళలకు ఆర్యోగ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా వివిధ రకాల వ్యాధుల బారిన పడి మహిళలు ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు.
మోదీ పుట్టిన రోజు నుంచి..
గాంధీ జన్మదినం వరకు..
మహిళలకు ఆరోగ్య విషయం తెలుసుకునేందుకు జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17 నుంచి జాతిపిత మహాత్మాగాంధీ పుట్టిన రోజు అక్టోబర్ 2 వరకు క్యాంపులు నిర్వహించారు. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, గూడూరు, మరిపెడ, తొర్రూరు, గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రత్యేక క్యాంపులు పెట్టి మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో జనరల్ మెడిసిన్, గైనకాలజిస్టు, పిల్లల వైద్యులు, సైకియాట్రిస్ట్‌లు, డెంటల్, చర్మ, ఈఎన్‌టీ, ఎంఎస్ సర్జన్ మొదలైన డాక్టర్లు క్యాంపుల్లో పాల్గొన్నారు.
1,56,134 మంది మహిళలకు పరీక్షల
స్వస్త్ నారీ.. సశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా 94 ప్రధాన క్యాంపులతో పాటు ఇంటింటి సర్వేలు, ఆస్పత్రుల్లో పరీక్షలు ఇలా మొత్తం 1498 క్యాంపులు నిర్వహించారు. ఇందులో మొత్తం 1,56,134 మంది మహిళలను పరీక్షించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరీక్షల్లో బీపీ, షుగర్, కేన్సర్, గర్భస్థ సమస్యలు, రక్తహీనత, టీబీ, హెచ్‌బీ, సికిల్‌సెల్, ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు అనుమానించి 1,21,492మందిలో బీపీ, షుగర్, రక్త హీనతను నిర్ధారించారు. మిగిలిన వారికి పూర్తిస్థాయి వ్యాధి నిర్ధారణ చేసేందుకు షాంపిల్స్ ల్యాబ్స్‌కు పంపించారు. అయితే ఇందులో నాన్ కమ్యూనికేబుల్ వాధ్యులు బీపీ, షుగర్, రక్త హీనతతో బాధపడుతున్నవారికి స్థానికంగా అందుబాటులో ఉన్న మాత్రలు ఇచ్చారు. మిగిలిన వారి జాబితా తయారు చేసి మెరుగైన చికిత్స అవసరమని ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల డాక్టర్లు అంకితభావంతో పరీక్షలు నిర్వహించగా.. మరికొందరు మాత్రం మొక్కుబడిగా క్యాంపులు పెట్టి ఊహాజనితమై నంబర్లు పంపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ద్వారా గుర్తించి రోగులకు మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
●
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం
ప్రభుత్వం నిర్దేశించిన అంశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వరకు జిల్లా వ్యాప్తంగా స్వస్త నారీ.. సశక్తి పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించాం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు అన్ని ఆస్పత్రుల్లో క్యాంపులు పెట్టి మహిళలకు పరీక్షలు నిర్వహించాం. నివేదికను ఉన్నతాధికారులకు అందించాం.
– రవి రాథోడ్, జిల్లా వైద్యాధికారి

ఆమెకు సుస్తీ!

ఆమెకు సుస్తీ!

ఆమెకు సుస్తీ!

ఆమెకు సుస్తీ!

ఆమెకు సుస్తీ!

ఆమెకు సుస్తీ!

ఆమెకు సుస్తీ!

ఆమెకు సుస్తీ!

ఆమెకు సుస్తీ!

ఆమెకు సుస్తీ!

ఆమెకు సుస్తీ!