
దారిపొడవునా మక్కలు..
మహబూబాబాద్ రూరల్ : మొక్కజొన్న కోతలు జరుగుతుండడంతో మహబూబాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రధాన రహదారులన్నీ మక్కలతో దర్శనమిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి మొక్కజొన్న పండించిన రైతులు మక్కలను ప్రధాన రహదారులపై ఆరబోసుకుంటున్నారు. క్రయవిక్రయాల సందర్భంలో తేమశాతం సమస్య రాకుండా ఉండేందుకు మక్కలను రోడ్లపై ఎండలో ఆరబోసుకుంటున్నామని తెలిపారు. దీంతో రోడ్లన్నీ బంగారు వర్ణంలో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. కిలోమీటర్ల పొడవునా మొక్కజొన్నలను ఆరబోస్తుండగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.