
అంతర్జాతీయ స్థాయిలో ‘ఎస్సార్’కు ర్యాంకింగ్
హసన్‌పర్తి: ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) వరల్డ్ ర్యాంకింగ్‌లో ఎస్సార్‌కు చోటు దక్కింది. ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్–2026లో 801–1000 శ్రేణిలో నిలిచింది. ఈ మేరకు శనివారం అన్నాసాగరంలోని ఎస్సార్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి మాట్లాడారు. తెలంగాణలో అంతర్జాతీయ ర్యాంకింగ్ సాధించిన ఏకై క యూనివర్సిటీ ఎస్సార్ అని చెప్పారు. బో ధన, పరిశోధన, సైటెషన్స్, అంతర్జాతీయ దృష్టి కోణం, ఇండస్ట్రీ ఇన్‌కమ్ వంటి ఐదు ప్రధాన విభాగాల ఆధారంగా 17 సూచిక ద్వారా ఈ ర్యాంకింగ్‌ను ప్రకటించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 5లక్షల యూనివర్సిటీలుండగా, ఐదు ఏళ్ల వయసు కలిగిన ఎస్సార్ గుర్తింపు పొందడం సంతోషకరంగా ఉందన్నారు.
కల సాకారమైంది..
తాను నెలకొల్పిన విద్యాసంస్థ ప్రపంచంలోనే గుర్తింపు సాధించాలనే తన కల సాకారమైందని ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్, ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి ఆనందం వ్యక్తం చేశా రు. ఇటీవల వెలువడిన ఎన్‌ఐఆర్‌ఎఫ్–2025 ర్యా కింగ్‌లో ఎస్సార్ యూనివర్సిటీ విభాగంలో 91 స్థా నం సాధించినట్లు చెప్పారు. విశ్వవిద్యాలయ విభాగంలో 101–150 శ్రేణిలో నిలిచినట్లు చెప్పారు. 2026 ఎడిషన్ జెడ్డా (సౌదీ అరేబియా)లో జరిగిన వరల్డ్ అకడమిక్ సందర్భంగా విడుదలచేసిన ర్యాంకింగ్‌లో అమెరికా మొదటి స్థానంలో చోటు దక్కించుకోగా, భారతదేశం రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఇందులో ఓవరాల్ విశ్వవిద్యాలయ విభాగంలో ఎస్సార్ 28 స్థానంలో, ప్రైవేట్ యూనివర్సిటీల్లో 10వ స్థానంలో చోటు దక్కించుకుందన్నారు. వైస్ చాన్స్‌లర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ బలమైన విద్యా ప్రతిపాదిక, అంతర్జాతీయ దృష్టి కోణానికి ర్యాంకింగ్ నిదర్శనంగా పేర్కొన్నారు. సమావేశంలో ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ మహేశ్, ప్రొఫెసర్ రమణారావు, రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనారెడ్డి, డీన్ ప్రొఫెసర్ పి.వి.రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
కల సాకారమైంది
ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్
వరదారెడ్డి