
ఖోఖో అభివృద్ధికి విశేష కృషి
వరంగల్ స్పోర్ట్స్: ఖోఖో క్రీడాభివృద్ధికి 15 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్నామని, అత్యున్నత స్థాయిలో కల్పిస్తున్న వసతులను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలపాలని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిషన్ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు కర్ణాటకలో జరుగనున్న సీనియర్ మెన్ అండ్ ఉమెన్ సౌత్‌జోన్ ఖోఖో పోటీల్లో పాల్గొనే తెలంగాణ జట్ల ఎంపిక పోటీలను శనివారం హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరిలో కాజీపేటలో జాతీ యస్థాయి సీనియర్ ఖోఖో పోటీలు నిర్వహిస్తుట్లు తెలిపారు. ఖోఖో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ శిబి రానికి ఎంపికై న వరంగల్ కరీమాబాద్‌కు చెందిన ఖోఖో క్రీడాకారిణి నవ్యశ్రీ ని రాఘవరెడ్డి సన్మాంచారు. కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనాతి కృష్ణమూర్తి, హ్యాండ్‌బాల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. పవన్‌కుమార్, పీఈటీల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కేకేఎఫ్ ఇండియా ఎథిక్స్ కమిషన్ కన్వీనర్ రాఘవరెడ్డి