
త్వరలో టీహబ్‌తో కేహబ్ ఒప్పందం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కేహబ్ హైదరాబాద్‌లోని టీహబ్‌తో త్వరలో అవగాహన ఒప్పందం చేయబోతున్నామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాలు శనివారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని వెల్లడించారు. వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలను ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్ స్టార్టప్‌లకు హాబ్‌లుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ రూసా వంటి సంస్థల మద్దతుతో విశ్వవిద్యాలయం ఫార్మసీ కాలేజీ మరింత అభివృద్ధి సాధిస్తోందన్నారు. వందలాది మంది పరిశోధకులు పీహెచ్‌డీలు పూర్తిచేసి వివిధ స్థాయిల్లో ఉన్నారన్నారు. అనంతరం మంత్రులు, వీసీ, పూర్వ విద్యార్థులు సావనీర్, రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. కేయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి కేయూ ప్రస్తుత, పూర్వ ఆచార్యులు పాల్గొన్నారు. ఈనెల 12న కూడా ఉత్సవాలు కొనసాగనున్నాయి.
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి
శ్రీధర్‌బాబు వెల్లడి