
నిధులేవి?
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
రైతు వేదికలకు
● మూడేళ్లుగా బిల్లుల చెల్లింపు నిలిపివేత
● నిర్వహణలో తప్పని ఇబ్బందులు
● కనీస సదుపాయాలు కరువు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. మూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతులకు పంటల సాగు, వ్యవసాయానికి సంబంధించిన సాంకేతికత, ఎరువుల వినియోగం, విత్తనాల ఎంపిక, చీడపీడల నివారణ, కలుపు, క్రిమిసంహారక మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెట్ సమాచారం వంటి అంశాలపై అవగాహన కల్పించడానికి రైతుల వేదికలను ఏర్పాటు చేశారు. అయితే నిధుల కొరత కారణంగా పర్యవేక్షణ ఇబ్బందికరంగా మారింది.
సౌకర్యాలు కరువు..
కొన్నిచోట్ల రైతు వేదికలు జనావాసాలకు దూరంగా ఉన్నాయి. దీంతో మహిళా వ్యవసాయ విస్తరణ అధికారి ఒక్కరే ఉండడానికి భయపడుతున్నారు. కాగా నిధులు రాకపోవడంతో తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేవు. దీంతో రైతు వేదికలకు రావడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు.
కేవలం ఐదు నెలల వరకే డబ్బులు..
జిల్లాలో రైతు వేదికల పర్యవేక్షణ కోసం నెలకు రూ.9వేల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ 2022లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మాత్రమే మెయింటెనెన్స్ నిధులు వచ్చాయి. అప్ప టి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలుగా బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కాగా, రైతు వేదికల మెయింటెనెన్స్ బిల్లులు ప్రతీనెల చెల్లిస్తే నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా రైతులకు అత్యుత్తమైన సేవలు అందించే ఆస్కారం ఉంటుంది.
ఏఈఓలపై భారం..
రైతు వేదికల నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో ఏఈఓలపై భారం పడుతోంది. ప్రతీ రైతు వేదికలో అన్ని పనులు వారే చూసుకోవాల్సి వస్తోంది. పంటలకు సంబంధించి ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం, సాగులో సమస్యలు తలెత్తితే పరిష్కరించడం, పీఎం కిసాన్ కేవైసీ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, రైతు విశిష్ట సంఖ్య నమోదు, పంటల నమోదు, రైతుబంధు, రైతు బీమా నమోదు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మట్టి నమూనాల సేకరణ తదితర పనులు చేస్తున్నారు. ఇవి కాకుండా రైతు వేదిక నిర్వహణ బాధ్యతలు వారికి భారంగా మారాయి. ఇతర సిబ్బంది లేకపోవడంతో ఏఈఓలే ఉదయం వచ్చి రైతు వేదికను ఊడ్చుకుంటున్నారు. ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కుర్చీలు వేయడం, ఇతర ఏర్పాట్లు చేయటం, టీ, స్నాక్స్ ఇవ్వడం, సమావేశం మొత్తం పూర్తయ్యే వరకు దగ్గరుండి సేవలు చేయాల్సి వస్తోంది. మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీరు, విద్యుత్, ఇతర మరమ్మతులకు ఏఈఓలు సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో జీపీ అధికారులు, సిబ్బందిని అడిగితే వారు పట్టించుకోవడంలేదని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
నిధుల కొరత వల్ల రైతు వేదికల పర్యవేక్షణకు ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో నిధుల విడుదలపై ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. రైతులకు సేవలు అందించే విషయంలో సమస్యలు తలెత్తకుండా నిధులు మంజూరు కాగానే చెల్లింపులు చేస్తాం.
– ఎం.విజయనిర్మల, జిల్లా వ్యవసాయ అధికారి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్
మండలం రైతు
వేదికలు
చిన్నగూడూరు 2
దంతాలపల్లి 3
డోర్నకల్ 4
కురవి 7
సీరోలు 4
మరిపెడ 10
నర్సింహులపేట 3
పెద్దవంగర 3
తొర్రూరు 6
మండలం రైతు
వేదికలు
బయ్యారం 5
గంగారం 4
గార్ల 4
గూడూరు 5
కేసముద్రం 5
ఇనుగుర్తి 2
కొత్తగూడ 5
మహబూబాబాద్ 6
నెల్లికుదురు 4

నిధులేవి?

నిధులేవి?

నిధులేవి?

నిధులేవి?

నిధులేవి?