
కలెక్టరేట్‌కు చేరిన ఎన్నికల సామగ్రి
మహబూబాబాద్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడుదల చేసిన జీఓ 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఎన్నికల ఎప్పు డు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా కలెక్టరేట్‌లో ఎన్నికల సామగ్రిని సిబ్బంది భద్రపరిచారు.
మెరుగైన వసతులు
కల్పించాలి
మహబూబాబాద్ రూరల్ : డోర్నకల్ రైల్వే ఆస్పత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ పీసీఎండీ నిర్మలరాజారాం, డీఆర్‌ఎం గోపాలకృష్ణన్, సీఎంఎస్ నారాయణస్వామికి మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ ఆవుల యుగంధర్ యాదవ్, డోర్నకల్ బ్రాంచ్ సెక్రటరీ అంజయ్య మాట్లాడుతూ.. సుమారు 10 వేలకుపైగా ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలు, 400లకుపైగా హై రిస్క్ వర్క్ చేసే లోకో పైలెట్లు, సీ అండ్ డబ్ల్యూ ఉద్యోగులు డోర్నకల్ రైల్వే ఆస్పత్రి పరిధిలో ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిలో గైనకాలజీ డాక్టర్, అదనపు సిబ్బంది, ల్యాబ్, ట్రాలీ ఎక్స్ రే, పీఎంఈ పరీక్ష కేంద్రం, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సుందరయ్య, నవజీవన్, శ్రీనివాస్, కరణ్ సింగ్, సీ.ఎస్.కె.యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మానసిక రోగులను గౌరవించాలి
నెహ్రూసెంటర్: మానసిక రోగులను గౌరవిస్తూ వారి భావాలను అర్థం చేసుకోవాలని ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంఓ జగదీశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎంఓ మాట్లాడుతూ.. మానసిక రోగుల భావాలను అర్థం చేసుకుని, వారికి అవసరమైన సపోర్టు ఇవ్వాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన మానసిక రోగులు, పరిణామాలు, విముక్తి పొందే పద్ధతులపై షార్ట్‌ఫిలీం ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, రోగులు తదితరులు పాల్గొన్నారు.
వేయిస్తంభాల గుడిలో
సంకటహర చతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు పెండ్యాల సందీప్‌శర్మ, పానుగంటి ప్రణవ్, శ్రవణ్ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకున్నారు. సాయంత్రం సంకటచతుర్థిని పురస్కరించుకుని దేవాలయంలోని ఉత్తిష్ట గణపతికి జల, క్షీర, పంచామృతాభిషేకం నవరస సుగంధ ద్రవ్యాలతో, హరిద్రాకుంకుమ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తర శతనామాలు పఠిస్తూ షోఢశోపచార పూజలు నిర్వహించారు. మహా హారతి మంత్రపుష్పం జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు అధికసంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు.

కలెక్టరేట్‌కు చేరిన ఎన్నికల సామగ్రి