
ఆందోళన కలిగిస్తున్న సిజేరియన్లు
● డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్
నెహ్రూసెంటర్: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలు గణనీయంగా పెరిగాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్, జీజీహెచ్ ప్రొఫెసర్ శశిజ్యోశ్న అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం సిజేరియన్‌లపై నిఖ్మ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం ఆడిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22 శాతం నుంచి 45 శాతానికి సిజేరియన్ ఆపరేషన్లు పెరిగాయని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 58 శాతం నుంచి 92 శాతానికి పెరిగినట్లు తెలిపారు. జిల్లాలో సీ–సెక్షన్ ప్రసవాలు అధికంగా జరుగుతున్న తీరుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆడిట్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి సారంగం, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ప్రత్యూష, డెమో ప్రసాద్, కేవీ రాజు, హెచ్ ఈ అనిల్‌కుమార్, లోక్య, మనోహర్ పాల్గొన్నారు.
పొగాకు వినియోగంతో మరణాలు..
పొగాకు వినియోగం వల్ల ఏటా దేశంలో 13.5లక్షల మరణాలు సంభవిస్తున్నాయని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ అన్నారు. జాతీయ యువజన పొగాకు రహిత క్యాంపెయిన్ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు నాగేశ్వర్‌రావు, సారంగం, లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జ్ ఏఓ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.