
చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి
● గణపురంలో ఘటన
గణపురం: చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గణపురం గ్రామానికి చెందిన దొంత రమేశ్ (32) తన స్నేహితుడితో కలిసి గణపసముద్రం చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ఊపిరాడక చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రేఖ అశోక్ తెలిపారు. ఈ ఘటనతో గణపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.