
వివాహిత ఆత్మహత్య
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో ని శివునిపల్లిలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. శివునిపల్లికి చెందిన అర్చకుడు తొరివి మోహన్‌శర్మ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య అశ్విని(40), ఒక కుమారుడు ఉన్నారు. రోజూ మాదిరిగానే మంగళవారం గుడిలో పూజలు ముగించుకుని ఇంటికెళ్లగా అశ్విని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉంది. గమనించిన మోహన్‌శర్మ కేకలు వేస్తూ ఆమెను కిందికి దింపి చుట్టుపక్కల వారిని పిలువగా అప్పటికే మృతిచెంది ఉంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఎస్సై వినయ్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అశ్విని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి తరఫున నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
మద్యంమత్తులో భార్యను హతమార్చిన భర్త
● తిర్మలాపూర్‌లో విషాదం..
చిట్యాల: మద్యం మత్తులో భర్త తన భార్యను రోకలిబండతో హతమార్చాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిర్మలాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కనుకుంట్ల లింగయ్య, ప్రమీల(50) దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొంత మేర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో దంపతులకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మద్యం తాగిన లింగయ్య.. మరోసారి తాగడానికి డబ్బులు ఇవ్వాలని తన భార్య ప్రమీలతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె లేవని బదులివ్వడంతో కోపోద్రిక్తుడైన లింగ య్య.. ప్రమీల తలపై రోకలి బండతో బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న సీఐ మల్లేశ్, ఎస్సై శ్రవణ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతురాలి చిన్న కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వివాహిత ఆత్మహత్య