
ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
మరిపెడ రూరల్: యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం మండలంలోని పీఏసీఎస్‌ను సందర్శించారు. గిరిపురం క్రాస్ రోడ్డులోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పీఏసీఎస్ కార్యాలయంలో యూరి యా పంపిణీ కేంద్రాన్ని సందర్శించి, ప్రతీ రైతుకు యూరియా అందేలా చూడాలన్నారు. అలాగే కేజీబీవీ వసతి గృహంలోని డైనింగ్ హాల్, స్టోర్ గది, కిచెన్ షెడ్, పిల్లలకు వండిన వంటలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పాఠశాలలోని తరగతి గదికి వెళ్లి పాఠ్యపుస్తకాల్లోని పలు అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఏ విజయ్‌చంద్ర, తహసీల్దార్ కృష్ణవేణి, ఏఓ బోడ వీరసింగ్, సీఈఓ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్