
దేశాభివృద్ధికి వన్ నేషన్ – వన్ ఎలక్షన్
కాజీపేట అర్బన్: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ రాజ్యసభ సభ్యుడు సయ్యద్ జాఫర్ ఇస్లాం తెలిపారు. హంటర్ రోడ్డులోని సీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో మంగళవారం ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్ కోసం తెలంగాణ విద్యార్థులు’ నినాదంతో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సయ్యద్ జాఫర్ ఇస్లాం హాజరై మాట్లాడారు. 1984లోనే నాటి ప్రధాని వాజ్‌పేయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన తీసుకురాగా అదే అంశాన్ని 2019లో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక తీసుకొచ్చారని తెలిపారు. ఎన్నికల్లో కోట్ల రూపాయల ఖర్చు తగ్గించుకునేందుకు, సమయం, ప్రజాధనం వృథాకాకుండా ఈ విధానం తోడ్పడుతుందని అన్నారు. విద్యార్థులు దేశాభివృద్ధికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేయాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ అంటోనీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాష్ట్ర కన్వీనర్ భర్తుర్ శ్రీరాం, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గౌతమి అహీర్‌రావు, మీజీ ఆర్మీ డాక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ భిక్షపతి మాచర్ల, క్లాసికల్ డ్యాన్సర్ బారాది విజయ్‌కుమార్, ఉత్తమ టీచర్ అవార్డు గ్రహీత నక్క స్నేహలత, వివిధ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్‌రెడ్డి, గంట రవికుమార్, వెంకటేశ్వర్లు, నిషిధర్‌రెడ్డి, రమేష్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, నాయకులు రావుపద్మరెడ్డి, కాళీప్రసాద్, రావు అమరేందర్‌రెడ్డి, కొత్త రవి, పాండేజీ, మల్లికారావు, అహన్యరాజ్, కార్తీక్ పాల్గొన్నారు.
‘కుడా’ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
నయీంనగర్: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అనే సామాజిక అవగాహన కార్యక్రమం కాళోజీ కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించడానికి మౌఖిక అనుమతి ఇచ్చి ‘కుడా’ అధికారులు రద్దు చేసినట్లు హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో శ్రేణులు మంగళవారం ‘కుడా’ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆఖరి నిమిషంలో కాళోజీ కళాక్షేత్రం అనుమతిని కూడా అధికారులు రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరుగుతుంటే అనుమతి ఎందుకు ఇవ్వరంటూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలకతీతంగా చేస్తున్న సామాజిక కార్యక్రమం అని చెప్పిన అధికారులు వినలేదన్నారు.‘కుడా’ వైస్ చైర్మన్‌తో అనుమతిని ఎందుకు రద్దు చేస్తున్నారో రాతపూర్వకంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కార్యక్రమాన్ని నగరంలోని సీఎస్‌ఆర్‌కు గార్డెన్‌కు మార్చినట్లు వారు తెలిపారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం