
రాష్ట్ర వ్యాప్తంగా పార్లర్ల ఏర్పాటు
బచ్చన్నపేట: రాష్ట్రంలో అన్నిచోట్ల విజయ డెయిరీ, పార్లర్లను ఏర్పాటు చేసి ఆయాప్రాంతాల్లోని దేవాలయాలు, అంగన్‌వాడీలు, హాస్టళ్లు, పాఠశాలలకు అవసరమైన పాలు, పాల పదార్థాలు సరఫరా పెంచాలని రాష్ట్ర విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన పార్లర్‌ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పలు గ్రామాల విజయ పాల డెయిరీ సొసైటీ చైర్మన్లకు పాల క్యాన్లను పంపిణీ చేశారు. విజయ పాల ఉత్పత్తుల డెయిరీ రాష్ట్రంలోనే జనగామ, బచ్చన్నపేట ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పాడితోపాటు, పంటలు పుష్కలంగా పండడానికి ఈ ప్రాంతంలో చెరువులు నింపడంలేద ని రైతులు కోరడంతో చెరువులు నింపే కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, జీఎం మధుసూదన్, మల్లయ్య, గోపాల్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
విజయ డెయిరీ చైర్మన్ అమిత్‌రెడ్డి