అదే క్యూ.. అవే కష్టాలు | - | Sakshi
Sakshi News home page

అదే క్యూ.. అవే కష్టాలు

Sep 3 2025 4:53 AM | Updated on Sep 3 2025 4:53 AM

అదే క

అదే క్యూ.. అవే కష్టాలు

బయ్యారం: బయ్యారంలోని వ్యవసాయ మార్కెట్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఇల్లెందు–మహబూబూబాద్‌ ప్రధాన రహదారిపై రైతులు యూరియా కోసం నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాగా, రైతులకు మా జీ జెడ్పీ చైర్‌పర్సన్‌ బిందు సంఘీభావం తెలిపారు. తహసీల్దార్‌ నాగరాజు, ఏఓ రాంజీ, ఎస్సై తిరుపతి రైతులతో మాట్లాడి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో సమస్యను డీఏఓ దృష్టికి తీసుకెళ్లగా యూరియా కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

దంతాలపల్లి: మండలంలో తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌, ఎస్సై రాజు, వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందజేశారు.

డోర్నకల్‌: మండలంలోని గొల్లచర్ల సమీపంలోని పీఏసీఎస్‌ వద్ద మధ్యాహ్నం వరకు 1,110 ఎరువుల బస్తాలను రైతులకు పంపిణీ చేశారు.

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ పీఏసీఎస్‌ వద్ద రైతులు బారులుదీరారు. ఆమనగల్‌, సికింద్రాబాద్‌ తండా గ్రామాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని శనగపురం, మానుకోట సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు.

కురవి: కురవి సొసైటీ ఆధ్వర్యంలో యూరియా పంపిణీ జరుగుతుందని తెలిసిన రైతులు తెల్ల వారుజామునే బారులుదీరారు. కూపన్ల కోసం క్యూలో నిలబడి అవస్థలు పడ్డారు. కాగా గతంలో కూపన్లు ఇచ్చిన రైతులకు 800 బస్తాల యూ రియా పంపిణీ చేశారు. కూపన్లు ఇచ్చే ప్రదేశానికి మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, మాజీ ఎంపీ కవి త వచ్చారు. అధికారులతో మాట్లాడి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు.

నెల్లికుదురు: మండలంలోని మూడు సొసైటీలు, పలు గ్రామాల ఎరువుల షాపుల ద్వారా 2,112 బస్తాల యూరియా పంపిణీ చేశామని మండల ప్రత్యేక అధికారి మరియన్న తెలిపారు. కాగా కూపన్ల కోసం రైతులు ఇబ్బందులు పడ్డారు.

గూడూరు: మండల కేంద్రంలోని పీఏసీఎస్‌, శ్రీనివాస ఫర్టిలైజర్‌ షాపునకు యూరియా వచ్చిందని తెలిసిన రైతులు తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడ్డారు. ఏఓ అబ్దుల్‌మాలిక్‌ పోలీసు ల సహకారంతో రైతులకు బస్తాలు సరఫరా చేశారు. కాగా అప్పరాజ్‌పల్లిలో సోమవారం అర్ధ రాత్రి నుంచే రైతులు టోకెన్ల కోసం క్యూ కట్టారు.

మరిపెడ: మరిపెడ పీఏసీఎస్‌కు యూరియా రా గా తెల్లవారుజాము నుంచే రైతులు చేరుకున్నా రు. సీఐ రాజ్‌కుమార్‌, ఎస్సై సతీష్‌ ఆధ్వర్యంలో యూరియా బస్తాలు అందించారు.

కొత్తగూడ: మండలంలోని పొగుళ్లపల్లి పీఏసీఎస్‌ వద్దకు సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు వేల మంది రైతులు యూరియా కోసం వచ్చారు. రైతుల ఆధార్‌ కార్డులు తీసుకొని టోకెన్లు మాత్ర మే ఇచ్చారు. కాగా క్యూలో ఉన్న గాంధీనగర్‌కు చెందిన ఆవుల నారాయణ అనే రైతుకు ఫిట్స్‌ వచ్చింది. గమనించిన ఎస్సై రాజ్‌కుమార్‌, సిబ్బ ంది ఆయనకు ప్రథమ చికిత్స అందించి కొత్తగూడ పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించారు.

గార్ల: గార్ల పీఏసీఎస్‌కు యూరియా రావడంతో తెల్లవారుజామునుంచే రైతులు క్యూలో చెప్పులు పెట్టుకున్నారు. అనంతరం రైతుకు ఒక యూరి యా బస్తా అందజేశారు.

చిన్నగూడూరు: మండలంలోని జయ్యారం, ఉగ్గంపల్లి రైతు వేదికలవద్ద రైతులు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు యూరియా కూపన్ల కోసం పడిగాపులు పడ్డారు.

నర్సింహులపేట: యూరియా కూపన్ల పంపిణీలో ఏఓ వినయ్‌కుమార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్‌ ఎదుట ఏఓ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. కూపన్ల కోసం తీసుకొచ్చిన పట్టాపాస్‌ బుక్కుల జిరాక్స్‌ కాపీలను తగులబెట్టి నిరసన తెలిపారు.

యూరియా కోసం

రైతుల బారులు

గంటల తరబడి క్యూలో నిరీక్షణ

పలుచోట్ల రోడ్డెక్కి రాస్తారోకో

యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మంగళవారం పీఏసీఎస్‌ల ఎదుట తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. టోకెన్ల కోసం గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. కాగా, పోలీసు బందోబస్తు మధ్య యూరియా బస్తాలు పంపిణీ చేశారు. పలుచోట్ల యూరియా కోసం రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేశారు.

అదే క్యూ.. అవే కష్టాలు1
1/2

అదే క్యూ.. అవే కష్టాలు

అదే క్యూ.. అవే కష్టాలు2
2/2

అదే క్యూ.. అవే కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement