
మంత్రి దామోదరకు సమస్యల ఏకరువు..
● వైద్య విద్యార్థులతో మంత్రి ముఖాముఖి
నెహ్రూసెంటర్: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వైద్య విద్యార్థులు సమస్యల ఏకరువు పెట్టారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాల హాస్టళ్ల భవనాలు ప్రారంభించిన అనంతరం మంత్రి రాజనర్సింహ.. వైద్య విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాలలో అందుతున్న సౌకర్యాలు, కల్పించాల్సిన వసతులను వివరించారు. కాగా, విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన వైద్య విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు తెలిపారు.
రవాణా సౌకర్యం లేక ఇబ్బంది..
మెడికల్ కళాశాల నుంచి ప్రభుత్వ ఆస్పత్రి, హాస్టళ్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నాం. అలాగే, కుటుంబ దత్తత ప్రోగ్రాం నిమిత్తం గ్రామాలకు వెళ్లాల్సిన సమయంలో రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం. – దమయంతి, వైద్య విద్యార్థిని
ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటున్నాం..
హాస్టల్ భవనాలు పూర్తి కాకపోవడంతో ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటున్నాం. రోజూ కళాశాల నుంచి ఆస్పత్రి, హాస్టళ్లకు 15 కిలో మీటర్ల మేర నడవాల్సి వస్తోంది. ఽథర్డ్ ఇయర్ చదువుతున్నాం. హాస్టళ్లు ఏర్పాటు చేస్తే పీజీకి ప్రిపేర్ అవుతాం.
– సత్యేంద్ర పాండే, వైద్య విద్యార్థి
గ్రౌండ్ ఏర్పాటు చేయాలి..
కళాశాలలో ప్లే గ్రౌండ్, జిమ్ ఏర్పాటు చేయాలి. విద్యతో పాటు శారీరక ఫిట్‌నెస్ కోసం గ్రౌండ్ ఉపయోగపడుతుంది. విద్యార్థుల ఇంటరాక్టివ్, మీటింగ్ కోసం ఆడిటోరియం ఏర్పాటు చేయాలి. బిల్డింగ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి. – ఏహ్తేషామ్, వైద్య విద్యార్థి
నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి..
హాస్టళ్లు, ఆస్పత్రి, కళాశాల బిల్డింగ్‌లు త్వరగా పూర్తి చేయాలి. ట్రాన్స్‌పోర్టు సమస్య పరిష్కరించాలి. స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి. లైబ్రరీ ఏర్పాటుచేసి బుక్స్ అందించాలి. సెంట్రల్ లైబ్రరీ, ఈ–లైబ్రరీ అందుబాటులోకి తీసుకురావాలి. – అనీషా, వైద్య విద్యార్థిని
●

మంత్రి దామోదరకు సమస్యల ఏకరువు..

మంత్రి దామోదరకు సమస్యల ఏకరువు..

మంత్రి దామోదరకు సమస్యల ఏకరువు..

మంత్రి దామోదరకు సమస్యల ఏకరువు..