
కిటెక్స్ కంపెనీలో గార్మెంట్ల తయారీ ప్రారంభం
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(కేఎంటీపీ)లో నెలకొల్పిన కేరళకు చెందిన కిటెక్స్ కంపెనీలో గార్మెంట్ల తయారీ ప్రారంభమైందని బీ ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం ట్విట్టర్(ఎక్స్) వేదికగా కంపెనీలో ఉత్పత్తి ప్రారంభమైందంటూ సంతోషం పంచుకున్నారు. కేరళ నుంచి కిటెక్స్ కంపెనీని తెలంగాణ(వరంగల్)కు తీసుకురావడం ఇంకా తన కళ్లముందే కనిపిస్తోందన్నారు. వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించడంపై కిటెక్స్ కంపెనీ యాజమాన్యానికి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వం, అవినీతిరహిత పాలనతోనే ప్రతిష్టాత్మక కిటెక్స్ సంస్థ తెలంగాణకు వచ్చిందని, భవి ష్యత్‌లో రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఈ కంపెనీ కీలక భూ మిక పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
ఎక్స్ వేదికగా సంతోషం