
దాతలు చేయూతనందించండి..
కాజీపేట: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను విధి వక్రీంచింది. పెళ్లి అయిన మూడు సంవత్సరాలకే మంచనపడేసింది. ఫలితంగా ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఒక్కసారిగా జీవచ్ఛవంలా మారడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాజీపేట పట్టణం సోమిడికి చెందిన నాయుడు మానస గౌడ్‌కు మూడు సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన బత్తిని వంశీకృష్ణతో వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల స్వల్ప అస్వస్థతగా ఉందని మానస చెప్పగా కుటుంబీకులు హైదరాబాద్‌లోని ఓ ఆస్సత్రికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించారు. మూత్ర పిండాలు, శ్వాసకోశతో పాటు అవయవాలు దెబ్బతిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధుల చికిత్సకు దాదాపు రూ.16 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు అప్పు చేసి రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. మిగతా డబ్బులు ఎంతకూ సమకూరడం లేదు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గం లేక మానస గౌడ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దీనిపై మనసున్న మాహారాజులు స్పందించి ముందుకొచ్చి మానస వైద్యానికయ్యే ఖర్చు అందించాలని కుటుంబ సభ్యులు చేతులెత్తి వేడుకుంటున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్పందించి ఉచితంగా వైద్య చికిత్స లభించేలా చూడాలని వేడుకుంటున్నారు.
దాతలు 99666 68666 నంబర్‌కు ఫోన్ పే (నాయుడు మనోజ్‌కుమార్) ద్వారా ఆర్థిక సాయం చేసి మానసను బతికించాలని వారు కోరుతున్నారు.
చావు బతుకుల మధ్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మానస..
వైద్య ఖర్చులకు సాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబీకులు

దాతలు చేయూతనందించండి..